"సేవ"
తెలుగు భాష , సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ
📖
2025 ఆగస్టు 29, 30, 31 తేదీలలో శుక్ర, శని, ఆదివారాల్లో నెల్లూరు, రేబాల లక్ష్మీ నరసారెడ్డి పురమందిరం (టౌన్ హాలు)లో
'తెలుగు భాషా ఉత్సవాలు'
🖥️
తెలుగు భాష , సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ "'సేవ" ఆధ్వర్యంలో తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు, చిచ్చర పిడుగు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్బంగా నెల్లూరు టౌన్ హాలు ప్రాంగణంలో 2025 ఆగస్టు 29, 30, 31 తేదీలలో శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 10 నుండి రాత్రి 10 గం. వరకు మూడు రోజుల పాటు "తెలుగు భాషా ఉత్సవాలు" జరుగనున్నాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు విశ్వవ్యాప్తంగా వున్న తెలుగు భాషాభిమానులను, భాషా సాహితీ వేత్తలను, కేంద్ర, రాష్ట్ర ప్రజా ప్రతినిధులను, తెలుగు సంఘాల ప్రతినిధులను, సినీప్రముఖులను, కవులను, రచయితలను ఈ కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము.
ఈ ఉత్సవాలలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సాంస్కృతిక, సాంఘీక అంశాలపై అనేక సదస్సులు, తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల సమ్మేళనములను వివిధ విభాగాలుగా నిర్వహిస్తున్నాము.
🌅
తేది 29-08-2025 శుక్రవారం
⏰ తెలుగు భాషా దినోత్సవం
గిడుగు రామమూర్తి పంతులు జయంతి
📖
ప్రారంభోత్సవ సభ
📜 సదస్సులు
⏲️ మొదటి రోజు
1. ప్రాచీన సాహిత్యం
2. ఆధునిక సాహిత్యం - కవిత్వం
3. బాల సాహిత్యం
⏰ రెండవ రోజు
తేది 30-08-2025 శనివారం⏰
4. యువ సాహిత్యం
5. రాష్ట్రేతర ప్రాంతాల్లో
తెలుగు భాషా సాహిత్యాలు.
6. మహిళా సదస్సు
7. అస్తిత్వవాద సాహిత్యాలు (దళిత, బహుజన, స్త్రీ, ముస్లీం, గిరిజన ప్రాంతీయ సాహిత్యాలు)
8. అవధానం మరియు సదస్సు
🕰️ మూడవ రోజు
తేది 31-08-2025 ఆదివారం⏰
9. ఆధునిక సాహిత్యం - విమర్శ.
10. తెలుగు భాష
11. ప్రచురణ, ప్రసార, సాంఘిక మాధ్యమాలు
12. కథ - నాటకం - సినీ సాహిత్యం
'సమాపనోత్సవ సభ'
📖
వచన కవిత సమ్మేళనములు :
1. బాల కవుల సమ్మేళములు
2. యువ కలాల సమ్మేళనం
3. మహిళా సమ్మేళనం
4. కవి సమ్మేళములు
5. పత్ర సమర్పణలు.
📖
వచన కవిత్వంతో పాటు
పద్య కవిత్వం,
మినీ కథలు,
గేయాలు,
గజళ్ళు, లఘు కవిత్వం, నానీలు ... మొదలగు ప్రక్రియలపై సమ్మేళనములు నిర్వహిస్తున్నాము.
అలాగే తెలుగు భాషా సాహిత్యం లోని అన్ని ప్రక్రియలు, అంశాలపై వివిధ సదస్సులు, పత్ర సమర్పణలు కొనసాగుతాయి. ఆయా ప్రక్రియల నిబంధనలు వర్తిస్తాయి.
🏆 తెలుగు భాష, సాహిత్య సదస్సులు, సమ్మేళనంలో పాల్గొన్న వారికి
📜 సంస్థ ప్రశంసా పత్రం,
🏆 ఒక జ్ఞాపిక ప్రముఖుల చేతుల మీదుగా సత్కారంతో పాటు కవితా సంకలనం పుస్తకం అందజేయబడును.
📃అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (US) వారి గుర్తింపు పత్రం అందజేయబడును.
తెలుగు భాషా, సాహితీ సదస్సుల్లో పాల్గొనే వారు, పత్ర సమర్పణలు చేయు వారు, కవి సమ్మేళనంలో
పాల్గొనువారు విధిగా ⏰
తేది 25-07-2025 లోగా రు. 500/- ఫోన్ పే / గూగుల్ పే/ UPI ద్వారా 9492224666 నంబరుకు చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవలెను. రుసుము చెల్లించిన వారు తప్పనిసరిగా స్క్రీన్ షాట్ ను, పేరు, చిరునామా, ఫోన్ నంబరుతో పాటు పాల్గొనే ప్రక్రియ వివరాలు
📲: 8333967666 నంబరుకు వాట్సాప్ చేయవవలెను.
పత్ర సమర్పణ చేయువారు తమ పత్రాన్ని, కవి సమ్మేళనంలో పఠనం చేయువారు తమ రచనను తేది 30-07-2025 లోగా 8333967666 నంబరుకు లేదా సమన్వయకర్తల నంబరుకు తప్పని సరిగా వాట్సాప్ చేయాలి. లేదా admn.seva@gmail. com ఐడికి మెయిల్ చేయాలి. పుస్తక సంకలనంలో అవే ప్రచురణమవుతాయి. తేది 30-07-2025 లోగా పంపిన వారి పేర్లు మాత్రమే ఆహ్వాన పత్రికలో ప్రచురించబడుతాయి. మార్పులు ఉండవు.
ఉత్సవాలలో పాల్గొన్నవారికి చక్కటి నెల్లూరు విందు భోజనం ఉంటుంది. వసతి సౌకర్యాలను మాత్రం ఎవరికీ వారే స్వంతంగా ఏర్పాటుచేసుకోవాలి. సహకారం ఉంటుంది. ఉత్సవాలలో పాల్గొనే భాషాభిమానులకు.. ప్రేక్షకులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదు.
💐🌸🙏🌸💐
ఇతర వివరాలకు
సదస్సుల సమన్వయ కర్తలు
డా. మాడభూషి సంపత్ కుమార్
+91 94440 75128
డా. పెరుగు రామ కృష్ణ
+91 98492 30443
డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య
+91 94904 00858
డా. కొణిదల శోభ +91 89192 73217
బోర భారతి దేవి +9192909 46292
కవి సమ్మేళనముల సమన్వయ కర్తలు
డా.పాతూరి అన్నపూర్ణ
+91 94902 30939
అవ్వారు శ్రీధర్ బాబు +91 85001 30770
జి. సుభద్రా దేవి +91 98486 27158
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్
+91 91779 15285
కె. సంధ్యారెడ్డి
+91 99891 91521
💐🌸💐
*గమనిక* :* సేవ ఎన్నికార్యక్రమాలు చేపట్టినా ఇప్పటి వరకు ఎవరి నుండి ఏమీ ఆశించలేదు. ఆర్ధిక వనరులు సమకూర్చుకోలేదు. తెలుగు భాషా సాహితీ సేవే లక్ష్యంగా 'సేవ' సారధులే కష్టనష్టాలను భరించడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి అందరి సహకారం అవసరంగా భావించి ముందడుగు వేసాం.
🥇
ఆర్ధిక సహకారం కోసం:*
మిత్రులు, శ్రేయోభిలాషులు, తెలుగు భాషా సాహిత్యాభిమానులు, సేవా తత్పరులు, దాతలు, పోషకులు విరాళములు ఇచ్చు వారు
Account No. 50 100 3759 20646
IFSC : HDFC0004284
ఖాతాకు 'సేవ' పేరిట పంపగోరుతాము. చెక్కులు, డ్రాఫ్టులు 'సేవ' పేరిట మీదే వుండాలి. ఫోన్ పే / గూగుల్ పే/ UPI ద్వారా పంపువారు 9492224666 నంబరుకు పంపగోరుతాము. విరాములు పంపినవారు తప్పనిసరిగా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతున్నాము.
అలాగే భాషా ప్రేమికులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని
కార్యక్రమాన్ని విజయవంతం చేయవల్సిందింగా కోరుతున్నాం.
🙏
సదా సేవలో
మీ
కంచర్ల సుబ్బానాయుడు
అధ్యక్షులు, 'సేవ'.
+91 9492666660